అచ్చంపేట ఏబీవీపీ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి - జన జాతి గౌరవ దినోత్సవం

15, Nov 2025 Achampet 176 Views
ఏబీవీపీ ఆధ్వర్యం లో ఘనంగా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి...

నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ఆదివాసి వీరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూరు విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

స్వతంత్ర పోరాట వీరుడు బిర్సా ముండా:

అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొక్తల శంతన్ మాట్లాడుతూ...

  • భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానీయుల కోవకు చెందిన ఆదివాసి వీరుడు బిర్సా ముండా అని కొనియాడారు.

  • ఆయన 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని వులిహాటు గ్రామంలో జన్మించారని తెలిపారు. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు.
  • బ్రిటిష్ పాలకుల దోపిడీ, దౌర్జన్యం నుంచి గిరిజన సమాజాన్ని రక్షించడానికి, యువకుడిగా బిర్సా ముండా "మన దేవుడు ప్రకృతిలో ఉన్నాడు, మన భూమి మన తల్లి, దాన్ని ఎవరూ దోచుకోలేరు" అని ప్రచారం ప్రారంభించి, గిరిజన హృదయాల్లో విప్లవాన్ని రగిలించారని వివరించారు.
  • బిర్సా ముండా కేవలం తిరుగుబాటుదారుడే కాదు, ఒక సాంస్కృతిక పునరుద్జీవకారుడు కూడా అని శంతన్ అన్నారు.

జన జాతి గౌరవ దినోత్సవం:

  • బిర్సా ముండా ప్రారంభించిన ఉల్గులాన్ విప్లవంలో వందలాది మంది గిరిజనులు వీరవరం పొందారని, చివరికి ఆయన పట్టుబడి 1900 జూన్ 9వ తేదీన కేవలం 25 ఏళ్ల వయసులో రాంచీ జైల్లో అమరుడయ్యారని గుర్తు చేసుకున్నారు.

  • బిర్సా ముండా జయంతి ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో ఆయన జయంతిని జన జాతి గౌరవ దినోత్సవం గా ప్రకటించిందని తెలిపారు.
  • ఆదివాసి ఆత్మగౌరవ పతాక అయిన బిర్సా ముండా స్ఫూర్తిని నేటి యువత, విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంతన్, పాలమూరు విభాగ్ కన్వీనర్ సతీష్, అర్జున్, అనిల్, సాయి, రాము, వెంకటేష్, కమల్, ప్రసన్న, జ్యోతి తదితర ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

TAGS: ABVP Birsa Munda Jayanti Achampet,Jan Jati Gaurav Diwas Achampet, Birsa Munda 150th Anniversary ABVP, Mokthala Shanthan speech, Government Girls College Achampet,Ensure ABVP, Bhagwan Birsa Munda, Achampet, Jan Jati Gaurav Diwas, Birsa Munda 150th Jayanti, ABVP Achampet news, Jan Jatiya Gaurav Divas, Mokthala Shantan ABVP, Tribal hero Birsa Munda, Achampet Girls College event, Bhagwan Birsa Munda 150th birth anniversary, Birsa Munda jayanti celebrations, ABVP Achampet unit, Government Girls College Achampet event, ABVP Telangana tribal program, Ulgulan movement Birsa Munda, tribal freedom fighter Birsa Munda, Birsa Munda legacy India, Nagarkurnool district student events, ABVP student activities Telangana

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com