మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: అచ్చంపేట సీఐ నాగరాజు

28, Apr 2026 Achampet 176 Views
Achampet CI Nagaraju and She Team officials addressing students about women's safety laws.

మహిళా చట్టాలపై అవగాహనతోనే రక్షణ.. ఆకతాయిలను ఎదిరించి నిలవండి: అచ్చంపేట సీఐ నాగరాజు

అచ్చంపేట: సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి మహిళలు తమకు ఉన్న చట్టపరమైన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని అచ్చంపేట సీఐ నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం (She Team) ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా యువతకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో యువత సన్మార్గంలో నడవాలని, సెల్ ఫోన్లలో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. విద్యార్థినులను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే భయపడకుండా ఎదిరించాలని, తక్షణమే డయల్ 100 లేదా షీ టీం నంబర్ 8712657676 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

యువత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు. విద్యార్థి దశలో చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్, షీ టీం ఎస్సై ఇందిర, హెడ్ కానిస్టేబుల్ పద్మ, బృందం సభ్యులు మల్లేష్, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: Shee Team Achampet, Achampet women safety awareness, CI Nagaraju Achampet news, She Team awareness program Telangana, Nagarkurnool district police news, Achampet latest news today, women laws awareness Telangana, Telangana police She Team news, Achampet student awareness program, women safety tips Telangana, Nagarkurnool breaking news, cyber safety youth Telangana, anti drugs awareness Telangana, Achampet constituency news, Telangana public safety news, women protection laws India news, Achampet police updates, Telangana latest news updates, rural awareness programs Telangana, She Team helpline Telangana, student guidance police news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com