అచ్చంపేట: కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ నాయకులు పట్టుగొమ్మలు లాంటి వారని, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ముందంజలో ఉండి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కొనియాడారు. అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్) లో నిర్వహించిన అచ్చంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి టిపిసిసి ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పగలు రాత్రి శ్రమించి అత్యధిక మెజార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం యువతకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే యూత్ కాంగ్రెస్ నాయకుల గెలుపును తన స్వంత గెలుపుగా భావించి, వారందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
అలాగే, రానున్న పట్టభద్రుల (Graduates) ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యూత్ కాంగ్రెస్ నాయకులు ముందుండి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టేలా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రాధాన్యతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com