అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Achampet 176 Views
Tragic Road Accident Near Achampet: 35-Year-Old Pavan Kumar Dies

అచ్చంపేట వై-రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: యువకుడు దుర్మరణం

అచ్చంపేట పట్టణ సమీపంలోని వై-రోడ్డు వద్ద గల స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న ప్రధాన రహదారిపై రాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిని నడింపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ (35)గా కుటుంబ సభ్యులు గుర్తించారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పవన్ కుమార్ అచ్చంపేట నుండి తన స్వగ్రామమైన నడింపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. వై-రోడ్డు స్విమ్మింగ్ పూల్ సమీపానికి రాగానే ప్రమాదానికి గురయ్యాడు. ఈ సంఘటనకు సంబందించిన పూర్తి విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Achampet, Achampet News, Achampet Latest News, Achampet Road Accident, Achampet Y Road, Y Road Accident, Achampet Accident, Pawan Kumar, Nadimpally, Nadimpally News, Nadimpally Youth, Swimming Pool Y Road, Motorcycle Accident, Road Accident, Fatal Accident, Road Safety, Nagarkurnool News, Nagarkurnool District, Telangana News, Accident News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com