అచ్చంపేట ఆర్టీసీ డిపోలో బస్సు పాసుల జాప్యం: విద్యార్థులు, జర్నలిస్టుల ఇబ్బందులు

24, Jul 2026 Achampet 176 Views
Achampet RTC Depot Bus Pass Delays: Hardship for Students & Journalists

నిబంధనలకు నీళ్లొదిలిన డీఎం?.. అచ్చంపేట ఆర్టీసీ డిపోలో బస్సు పాసుల తిప్పలు

అచ్చంపేట ఆర్టీసీ డిపోలో జర్నలిస్టులు, విద్యార్థులు, వికలాంగులకు మంజూరు చేయాల్సిన రాయితీ బస్సు పాసుల విషయంలో తీవ్ర జాప్యం, అనవసర కొర్రీలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పాసులు జారీ చేయాల్సి ఉండగా, అదనపు ధ్రువపత్రాలు కోరడం, చిన్నచిన్న కారణాలతో దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

పాసుల కోసం పలుమార్లు డిపోకు వెళ్లినా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులు నిత్యం ప్రయాణించాల్సి ఉండటంతో రాయితీ పాసుల జాప్యం వారికి అదనపు ఆర్థిక భారం మోపుతోంది. జర్నలిస్టుల బస్సు పాసుల రెన్యువల్‌కు ఆగస్టు 3 వరకు గడువు ఉన్నప్పటికీ, మూడు రోజులుగా బస్సు పాస్ కౌంటర్ మూసివేయడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ఆరోపణలపై వివరణ కోసం అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ బి. శ్రీనివాస్‌ను సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Tags: Achampet RTC Depot, Achampet Bus Pass Issue, RTC Bus Pass Delay Achampet, Achampet Student Bus Pass, Achampet Journalist Bus Pass, Achampet Disabled Bus Pass, RTC Pass Renewal Achampet, Achampet TSRTC News, Bus Pass Problems Achampet, Achampet RTC Depot Manager, TSRTC Concession Pass, Achampet Transport News, Telangana RTC Pass Issue, Student Bus Pass Telangana, Journalist Pass Renewal Telangana, Disabled Pass Application, Achampet Public Issues, TSRTC Achampet Depot, Bus Pass Counter Closed, Achampet Latest News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com