ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి; అచ్చంపేట గేట్ మీటింగ్‌లో SWF డిమాండ్

20, Jul 2026 Achampet 176 Views
SWF State President Viranjaneyulu addressing RTC workers gate meeting at Achampet Depot gate

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి: SWF రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు

అచ్చంపేట: ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, కార్మికులందరికీ సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో గేటు ముందు నిర్వహించిన కార్మికుల గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం ఎస్ డబ్ల్యూ ఎఫ్ (SWF) సంఘాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులందరూ బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. అయితే, విలీనానికి ముందు ఉన్న సమస్యల పరిష్కారం, విలీనం తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ఒక ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేయాలని, ఆ నివేదికను కార్మికులకు, యాజమాన్యానికి వివరించిన ఏకైక సంఘం ఎస్ డబ్ల్యూ ఎఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగానే 11 శాతం వేతన సవరణ (PRC) సాధ్యమైందని ఆయన గుర్తుచేశారు.

రాబోయే విలీన ప్రక్రియలో కార్మిక సంఘాల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందని, విలీనం ద్వారా కార్మికులకు పూర్తి లాభం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. పని భారం తగ్గించి, ఎలాంటి వేధింపులు లేని ఆత్మగౌరవ వాతావరణంలో ఉద్యోగం చేసుకునే పరిస్థితులను కల్పించాలన్నారు.

ఈ గేట్ మీటింగ్‌లో ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, రీజనల్ కార్యదర్శి ఎస్. వెంకటయ్య, అధ్యక్షులు కృష్ణ, డిపో అధ్యక్ష కార్యదర్శులు చెన్న కేశవులు, రీజినల్ నాయకులు గోపాల్, డిపో నాయకులు విజయ్, ఆంజనేయులు, డానియిల్, శ్రీను, సీఐటీయూ (CITU) మండల కార్యదర్శి బి. రాములు మరియు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Tags: Achampet RTC News, RTC Merger with Government, RTC Employees Job Security, SWF Telangana, Veeranjaneyulu SWF, RTC Workers Protest, RTC Gate Meeting Achampet, Telangana RTC Employees, RTC Staff and Workers Federation, RTC PRC 11 Percent, RTC Workers Rights, TSRTC News, Achampet News, Nagarkurnool News, CITU RTC Workers
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com