అచ్చంపేట ఆర్టీసీ 'ఎక్స్‌ప్రెస్' ఛార్జి : ఆర్డినరీ బస్సులకు అధిక ఛార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం

15, Apr 2026 Achampet 176 Views
An old RTC bus with an 'Express' board highlighting the poor condition of public transport in Achampet.

మెరుగైన సేవల ముసుగులో 'ఎక్స్‌ప్రెస్' ఛార్జి : అచ్చంపేట ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం

అచ్చంపేట: "ప్రజల సౌకర్యార్థం.. ప్రజల సేవే మా లక్ష్యం" అనే నినాదంతో నడిచే ఆర్టీసీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపో అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు: అచ్చంపేట నుండి హైదరాబాద్‌కు నడిచే బైపాస్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల పేరుతో అధికారులు జిమ్మిక్కులు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేని, పాతబడిన ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఛార్జీల బాదుడు.. సౌకర్యాలు నిల్: బస్సు కండిషన్ ఏమాత్రం బాగోలేకపోయినా, ప్రయాణికుల నుండి మాత్రం ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను వసూలు చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు సరిగ్గా లేవు, ప్రయాణం సుఖంగా లేదు, కానీ టికెట్ ధర మాత్రం ఎక్స్‌ప్రెస్ పేరుతో అధికంగా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికారుల ధ్యాస కేవలం ఆదాయంపైనే ఉంది తప్ప, ప్రయాణికుల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ప్రయాణికుల డిమాండ్: ఆర్డినరీ బస్సులను తక్షణమే తొలగించి, ఎక్స్‌ప్రెస్ ఛార్జీలకు తగ్గట్టుగా కండిషన్‌లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆర్డినరీ ఛార్జీలనే వసూలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అచ్చంపేట డిపోలో జరుగుతున్న ఈ ఛార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

TAGS: Achampet RTC express bus charges issue passenger complaints Telangana, Nagarkurnool RTC depot express fare ordinary buses controversy, Achampet to Hyderabad bus service problems RTC news, Telangana RTC passengers protest high ticket charges poor service, Achampet latest news RTC bus condition complaints express charges, Telangana transport issue ordinary buses running as express, Nagarkurnool district RTC passengers anger bus services, Achampet RTC depot irregularities ticket fare issue, Telangana bus passengers demand better services RTC, Hyderabad route RTC express bus complaints Achampet
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com