అచ్చంపేట: సింగారంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. 7 నెలలుగా రైతు గోస

24, May 2026 Achampet 176 Views
Distressed farmer Gandikota Shekar standing in his barren field holding a sagging electricity wire, complaining about the broken power poles in Singaram village, Achampet.

సింగారంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం: నేలకొరిగిన స్తంభాలు.. ఏడు నెలలుగా సాగు నిలిచిపోయిందంటూ రైతు ఆవేదన!

అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని సింగారం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ సామాన్య రైతు సాగుభూమి ఎడారిగా మారుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాల్సిన సిబ్బంది బాధ్యతారహిత్యంగా సమాధానం చెప్తుండటంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.

బాధిత రైతు గండికోట శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు సర్వే నెంబర్ల పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ఎల్టీ లైన్ (LT Line) కు సంబంధించిన నాలుగు విద్యుత్ స్తంభాలు పూర్తిగా కిందపడిపోయాయి. అందులో రెండు స్తంభాలు విరిగిపోయి, వైర్లు నేలకు వేలాడుతున్నాయి. ఈ ప్రమాదం జరిగి ఏడు నెలలు గడుస్తున్నా.. విద్యుత్ అధికారులు కానీ, క్షేత్రస్థాయి సిబ్బంది కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.

స్తంభాలు పడిపోవడం వల్ల కరెంటు సప్లై లేక గత యాసంగి  సీజన్‌లో ఒక్క ఎకరంలో కూడా పంట సాగు చేయలేకపోయానని రైతు శేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పొలమంతా పత్తి లోట్లతో అలాగే ఉండిపోయిందని, పశువులకు మేత లేదు, మనుషులకు తిండి లేని దారుణమైన పరిస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుండటంతో కనీసం ఇప్పుడైనా పంట వేసుకుందామనుకుంటే.. నేలకు వేలాడుతున్న కరెంటు వైర్ల వల్ల పొలం దున్నే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపాడు.

ఈ విషయమై స్థానిక లైన్ మెన్ మరియు ఏఈ (AE) గారిని కలిసి స్తంభాలు వేసి, వైర్లు సరిచేయాలని వేడుకుంటే.. "మాకు తెలియదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతు ఆరోపించాడు. ఇప్పటికైనా సంబంధిత శాఖా మంత్రులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇమ్మీడియట్‌గా  స్తంభాలు నాటించి, వైర్లు సరిచేసి తమకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని బాధిత రైతు గండికోట శేఖర్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

TAGS: Achampeta vaarthalu, Singaram graama vaarthalu, Achampeta mandala vaarthalu, Nagarkurnoolu jilla vaarthalu, Telangana vaarthalu, vidyut shaakha nirlakshyam, nelakoriginna vidyut sthambhaalu, LT line samasya Telangana, raithula samasyalu Achampeta, Gandikota Shekar raithu, current sarafaraa samasya, vidyut valla vyavasaaya nashtam, nelaku velaaduthunna vairlu, Telangana raithula samasyalu, saagu nilichipoyindi, graameena vidyut samasyalu, Achampeta vyavasaaya vaarthalu, vidyut AE nirlakshyam, Telangana graameena vaarthalu, raithu prabhutvaaniki vignapthi
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com