లక్కీ డిప్ ద్వారా 5 గ్రా. బంగారు ముక్కుపుడక బహుమతి: అమ్రాబాద్‌లో అందించిన CBM ట్రస్ట్ చైర్ పర్సన్

07, Oct 2025 Amrabad 176 Views
అమ్రాబాద్‌లో లక్కీ డిప్ ద్వారా అమ్మవారి బంగారు ముక్కుపుడక బహుమతి: అందజేసిన డాక్టర్ అనురాధ

అమ్రాబాద్:

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్రాబాద్ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి సతీమణి, సీబీఎం (CBM) ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ అనురాధ గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకలో సీబీఎం ట్రస్ట్ సహకారంతో దుర్గామాత అమ్మవారికి సమర్పించిన 5 గ్రాముల బంగారు ముక్కుపుడకను లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన వ్యక్తికి డాక్టర్ అనురాధ గారు స్వయంగా అందజేశారు.

డాక్టర్ అనురాధ గారి సందేశం:

ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ గారు మాట్లాడుతూ, తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న దుర్గామాత ముక్కుపుడక దక్కించుకోవడం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. ఇలాంటి మహిమ కలిగిన ముక్కుపుడకను సాధారణంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి భక్తులు దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతారని తెలిపారు.

అయితే, ఒక సామాన్య, పేద, మధ్య తరగతి వ్యక్తికి అమ్మవారి ఆశీర్వాదం దక్కాలనే ఉద్దేశంతో, సీబీఎం ట్రస్ట్ సహకారంతో, అమ్మవారికి ధరించిన 5 గ్రాముల బంగారు ముక్కుపుడకను లక్కీ డిప్ ద్వారా గెలుచుకునే అదృష్టాన్ని కల్పించామని ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Amrabada Dasara Celebrations, Dr. Anuradha CBM Trust, Gold Nose Pin Lucky Dip, Amreshwara Swamy Temple, Saddula Bathukamma, MLA Vamshikrishna Wife, CBM Trust Chairperson Dr Anuradha, Amreshwara Swamy Temple Amrabad, Devi Sharannavaratrulu celebrations, Goddess Durga gold nose pin, Saddula Bathukamma event, Bathukamma festival Telangana, Amrabad temple festival, Sharannavaratri Telangana, religious celebrations Nallamala, women participation Bathukamma, Telangana cultural traditions, Nagarkurnool district temple news, Durga Devi puja Telangana

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com