బిజినేపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా: 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్

22, Sep 2025 Achampet 176 Views

నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం (MPDO) ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ MPDO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ ధర్నాలో సిఐటియు నాయకులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికులకు సమయానికి జీతాలు అందకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులకు వైద్యం కూడా చేయించలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

యూనియన్ మండల అధ్యక్షుడు జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే, గ్రామాలను శుద్ధి చేసే గ్రామపంచాయతీ కార్మికులు మాత్రం ఆకలితో బతకాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజినేపల్లి మండలం గౌరవ అధ్యక్షులు రాములు యూనియన్ సభ్యులు రామకృష్ణ,సామ శ్రీశైలం, శంకర్, స్వామి, సురేష్, రాము, రవి, ఎల్లయ్య, సుజాత, మైబుస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

TAGS: Bijinepally Gram Panchayat Workers, Pending Salaries, MPDO Office Protest, CITU R Srinivasulu, Nagarkurnool Panchayat Workers, Jaswanth Kumar, Bijinepally Gram Panchayat workers protest, Nagarkurnool district news, MPDO office protest, pending wages demand, three months salary arrears, CITU leader R Srinivasulu, Panchayat worker agitation Telangana, labor rights Telangana, government employee pending wages, rural worker protest Telangana, Panchayat employees salary issue, wage arrears Telangana, Achampet constituency news, Telangana labor union news, rural governance protests

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com