ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 2026 Achampet 176 Views
BJYM leader Dhannoju Naresh Chari leading student signature campaign for fee reimbursement at Achampet college

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజెవైఎమ్ సంతకాల సేకరణ

అచ్చంపేట:

రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో "ఫీజుల బకాయి - బిజేపి లడాయి" నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలలో బిజేవైఎమ్ నాయకులు విద్యార్థుల నుంచి భారీ ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం

బిజేవైఎమ్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలైనా ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించుకోలేని దయనీయ స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు ఆయనకు కనిపించడం లేదని విమర్శించారు.

మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు

"కేజీ టూ పీజీ విద్య ఉచితం అని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటీగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో ఏమీ చూపించడం లేదు" అని నరేష్ చారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ. 15,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలి

రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్ అచ్చంపేట కన్వీనర్ శివ చంద్ర, కో-కన్వీనర్ రాకేష్, BJYM రాష్ట్ర నాయకులు చెందులాల్ చౌహాన్, శివాజీ నరేష్, కార్తీక్ రెడ్డి, అజయ్, రవి, బాలకోటి, శరత్, కౌశిక్, సాయి, అరవింద్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Achampet, Achampeta News, BJYM, Bharatiya Janata Yuva Morcha, BJYM Achampet, Fee Reimbursement, Fee Reimbursement Telangana, Scholarship Pending, Scholarship Bakayilu, Fees Bakayilu BJP Ladai, Signature Campaign, Student Signatures, Achampet Colleges, Master Minds Junior College, Government Girls Junior College, Dhannoju Naresh Chary, Revanth Reddy Government, Telangana Students, Nagar Kurnool News, Telangana Education News, BJP Telangana, Telangana News
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com