నాగర్‌కర్నూల్‌లో జనగణనను పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

11, May 2026 Achampet 176 Views
Collector Hemant Keshav Patil interacting with census enumerators in Nagarkurnool

నాగర్‌కర్నూల్‌లో జనగణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్‌కర్నూల్: దేశ భవిష్యత్తు ప్రణాళికా రూపకల్పనలో జనగణన అత్యంత కీలకమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ, మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ రోడ్ నెం–3లో కొనసాగుతున్న జనగణన సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికీ వెళ్తున్న ఎన్యూమరేటర్లతో మాట్లాడి, వివరాల నమోదు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడిందని, స్వాతంత్ర్యం తర్వాత ఇది 16వ జనగణన అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని, ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే 'స్వీయ గణన' విధానాన్ని కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు.

జనగణనలో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని, కేవలం ఐదు నిమిషాల్లోనే దీనిని పూర్తి చేయవచ్చని ఆయన వివరించారు. ఎన్యూమరేటర్ల ఐడీ కార్డులపై ఉన్న క్యూ ఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు కనిపిస్తాయని, ప్రజలు అధికారిక సిబ్బందికి సహకరించి ఖచ్చితమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచార సేకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

TAGS: Nagar Kurnool Collector, Hemanth Keshav Patil, Census Survey Nagar Kurnool, Population Census Telangana, Digital Census 2026, Nagar Kurnool News, Census Inspection, House Listing Survey, Telangana Census Process, Self Enumeration, Enumerator Survey, Raghavendra Colony Nagar Kurnool, Municipal Commissioner Nagireddy, Telangana Government Survey, Census 2026 India, Digital Survey Telangana, Local Administration News, Telangana Latest News, Government Data Collection

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com