వంకేశ్వరంలో ముగిసిన మహానీయుల జ్ఞాన చైతన్య యాత్ర.. ప్రజల్లో చైతన్యం తెస్తున్న డా. మల్లు రవి అడుగ

08, Jun 2026 Padara 176 Views
Cultural artists performance and community gathering during Dr. Mallu Ravi's Gnana Chaitanya Yatra in Vankeshwaram village.

వంకేశ్వరంలో ముగిసిన ‘మహానీయుల జ్ఞాన చైతన్య యాత్ర’.. మహానీయుల ఆశయాల దిశగా ప్రజలను చైతన్యపరుస్తున్న డాక్టర్ మల్లు రవి ప్రణాళిక!

పదరా (అచ్చంపేట): సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక మార్పు కోసం డాక్టర్ మల్లు రవి  ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి "మహానీయుల జ్ఞాన చైతన్య యాత్ర" పదరా మండలంలో విజయవంతంగా కొనసాగుతోంది. మండలంలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, పుడిమిళ్ళ, చిట్లం గుంట్ల మీదుగా సాగిన ఈ చైతన్య యాత్ర మంగళవారం వంకేశ్వరం గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న యాత్ర బృందానికి స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

వంకేశ్వరంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బంగారు మాణిక్యం , గ్రామ సర్పంచ్ బొమ్మనపల్లి మౌనిక , తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ వెనుపోతుల అనిల్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్, స్థానిక యువకులు మరియు యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాటల ద్వారా సామాజిక చైతన్యం: ఈ యాత్రలో భాగంగా రేణుక కళాకారుల బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక గీతాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాటి సమాజంలో వివక్షపై పోరాడిన మహానీయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, ఏపీజే అబ్దుల్ కలాం, సురవరం సుధాకర్ రెడ్డి, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, మరియు సేవాలాల్ మహారాజ్ వంటి సంఘసంస్కర్తల ఆలోచనలను, వారు చూపిన బాటను ప్రజలకు వివరించారు.

నిర్వాహకుల సందేశం: "మహానీయుల ఆశయాలు, ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి ఇంటికీ చేరాలన్నదే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సొసైటీ ద్వారా ముఖ్యంగా మహిళలు కూడా అన్ని రంగాలలో చైతన్యవంతులు కావాలి. గ్రామ గ్రామాన కళాకారుల పాటల ద్వారా ఈ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం."

ఈ జ్ఞాన చైతన్య యాత్ర విజయవంతం కావడానికి కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న జి. సుధాకర్, సోషల్ సర్వీస్ ప్రతినిధి తాండ్ర రాములు గారు మరియు వారి బృందం క్షేత్రస్థాయిలో ఉండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. మహానీయుల స్ఫూర్తిని రగిలిస్తున్న ఈ యాత్ర పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS: Mahaneeyula Gnana Chaitanya Yatra, Dr Mallu Ravi Yatra, Vankeshwaram News, Padara Mandal News, Achampet News, Nagarkurnool News, Social Awareness Yatra Telangana, Congress Party Programs, Mallu Ravi Latest News, SC ST BC Minority Welfare Society, Renuka Kalakarula Brundam, Vankeshwaram Village News, Ambedkar Ideology Awareness, Savitribai Phule Inspiration, APJ Abdul Kalam Ideals, Social Change Programs Telangana, Telangana Cultural Programs, Youth Awareness Campaign, Padara Latest News, Telangana Congress News
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com