అచ్చంపేటలో అబ్దుల్ కలాం ఉపన్యాస పోటీలు - విజేతలకు హైదరాబాద్ టూర్

12, Nov 2025 Achampet 176 Views
డాక్టర్ కలాంపై ఉపన్యాస పోటీలు: అచ్చంపేటలో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ...

అచ్చంపేట:

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే లక్ష్యంతో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట మండల స్థాయిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర, విజయాలు మరియు దేశానికి ఆయన చేసిన సేవలు అనే అంశంపై ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు స్థానిక జడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) పాఠశాల నందు ఆర్. జ్యోతిలాల్ (హరిత ఫౌండేషన్ సభ్యులు) ఆధ్వర్యంలో జరిగాయి. మండలంలోని 12 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ కలాం గారి గురించి ఎంతో చక్కగా వివరించడం అందరినీ ఆకట్టుకుంది.

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: MEO జీవన్ కుమార్:

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ జీవన్ కుమార్ మాట్లాడుతూ...

  • విద్యార్థులు కష్టపడి చదువుకొని, ఏపీజే అబ్దుల్ కలాం గారి లాగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
  • భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా ఎదగాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.

స్థానిక పాఠశాల జీహెచ్‌ఎం సరళ మేడమ్ మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో మహిళలు కూడా అన్ని రంగాలలో ముందు ఉండాలని, కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

విజేతలకు హైదరాబాద్ టూర్ బహుమతి:

హరిత ఫౌండేషన్ సభ్యులు జ్యోతిలాల్ మాట్లాడుతూ...

  • మండలంలోని 12 పాఠశాలల నుంచి ఎంపికైన 24 మంది విద్యార్థులకు ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం మరియు ఇస్రో రీసెర్చ్ సెంటర్ను విజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
  • ఈ విద్యా యాత్రను హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు.

విజేతలు వీరే:

పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేశారు:

ప్రథమ బహుమతి : బి. అనిల్ - జీహెచ్ఎస్ అచ్చంపేట

ద్వితీయ బహుమతి : పి. అంజలి - జడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) అచ్చంపేట

తృతీయ బహుమతి : ఎం. శ్రావణి - పిటిజి (ఐనుల్గార్)

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ మొమెంటోస్, సర్టిఫికెట్లు మరియు పుస్తకాలు అందించారు. ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమం నిర్వహించినందుకు ఫౌండేషన్ సభ్యులు ఆర్. జ్యోతిలాల్ గారిని శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ జీవన్ కుమార్, జీహెచ్‌ఎం సరళ, జీహెచ్‌ఎం గోపాల్, జ్యోతిలాల్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

TAGS: Achampet News, Haritha Foundation, Dr APJ Abdul Kalam Contest, MEO Jivan Kumar, ISRO visit for students, Education news Achampet, Jyothilal Haritha Foundation, Kalam elocution contest Achampet, Haritha Foundation Achampet, Dr APJ Abdul Kalam life and contributions, Achampet student competitions, ZPHS Girls School Achampet, Mandal level elocution competition, MEO Jivan Kumar, girl students education Telangana, student educational tour Hyderabad, ISRO Hyderabad visit students, Birla Planetarium Hyderabad tour, Science Museum Hyderabad, Nagarkurnool district education news, student inspiration programs Telangana

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20261 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20262 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20261 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com