హైదరాబాద్‌లో కొత్తగా 10 బస్ డిపోలు, 2800 ఎలక్ట్రిక్ బస్సులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

23, Sep 2025 Achampet 176 Views

హైదరాబాద్‌లో కొత్తగా 10 బస్ డిపోలు.. 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు: సజ్జనార్ 

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను మెరుగుపరచడానికి టీజీఎస్‌ఆర్టీసీ వచ్చే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ సౌకర్యాల కోసం కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. పండుగల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

హైలైట్:

 హైదరాబాద్‌లో కొత్తగా 10 బస్ డిపోలు2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులుఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన  ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించడానికి, ప్రజా రవాణాను మెరుగుపరచడానికి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు డిపోల పరిధిలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి.

 పర్యావరణహితంతో పాటుగా.. డీజిల్ బస్సులతో పోల్చితే ఖర్చు తక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. దీంతో రాజధానిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడవనున్నాయి. కేవలం బస్సులు ప్రవేశపెట్టడమే కాకుండా.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఆర్టీసీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆరు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కేంద్రాలు ఉండగా.. త్వరలో మరో 9 డిపోల్లో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా నగరం అంతటా రవాణాను మెరుగుపరచడానికి కొత్తగా 10 డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ప్రణాళికలు వేసింది. ఈ కొత్త డిపోల్లో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి స్థలం కోసం అన్వేషణ జరుగుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో పాత గౌలిగూడ బస్టాండ్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది. దీనిని కేవలం బస్‌స్టాండ్ గానే కాకుండా.. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒక పెద్ద ఛార్జింగ్ స్టేషన్‌గా మార్చాలని చూస్తోంది. ఈ నిర్ణయం వల్ల నగరంలో రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడనుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7,754 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారికి సురక్షితమైన ప్రయాణ సేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com