అడుగంటిన కృష్ణమ్మ.. జూలై దాటినా రాని వరద | Krishna River Dry updates

16, Jul 2026 Achampet 176 Views
Dry Krishna riverbed with exposed rocks due to lack of water inflow from Karnataka dams.

ఎగువన భారీ వర్షాలున్నా దిగువకు రాని నీరు: అడుగంటిన కృష్ణమ్మ, రైతుల ఆందోళన

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానది మాత్రం ఇంకా అడుగంటినే కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలకు అక్కడి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే, కర్ణాటక ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేయకపోవడంతో కృష్ణానదిలో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది.

జూలై సగం దాటినా నదిలోకి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో సాగు నీటి కోసం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేక అనేక చోట్ల రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. వర్షాకాలం సగం కావస్తున్నా ఇంకా సాగు పనులు ఊపందుకోకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి, కర్ణాటక ప్రభుత్వంతో ఉన్నతాధికారాల స్థాయిలో మాట్లాడి వెంటనే కృష్ణా నీటిని విడుదల చేయించేలా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

TAGS: Krishna River Water Shortage, Telangana Krishna River, Krishna River News, Telangana Farmers Problem, Karnataka Water Release, Almatti Dam Water, Narayanpur Dam Water, Krishna Water Release, Telangana Irrigation News, Farmers Irrigation Problem, Krishna Basin Farmers, Telangana Water Crisis, Krishna River Drought, July Rainfall Telangana, Krishna Water Dispute
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com