బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మకండి: లింగాల కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రెస్ మీట్

21, Jan 2026 Lingal 176 Views

కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందనేది అబద్ధం: అసత్య ప్రచారాలను నమ్మకండి - కొత్త నాగేశ్వరరావు

లింగాల (నాగర్ కర్నూల్): లింగాల మండలం శ్రీరంగాపురం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, సీనియర్ నేత రంగినేని శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో భారీ చేరికలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, మాకం తిరుపతయ్యలు మొదటి నుంచీ బీఆర్ఎస్ సానుభూతిపరులేనని, పాత వారికే మళ్ళీ కండువాలు కప్పి కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ఉనికి కోసమే ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.

శ్రీరంగాపురం సర్పంచ్ శ్రీశైలం మరియు వార్డు సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే వంశీకృష్ణ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెంచేటి శివ, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

TAGS: Lingala News, Lingala latest News, Lingala Mandal latest News, Lingala News Today, Achampet MLA Vamsi Krishna, Lingala Congress News, Kotta Nageswara Rao, BRS Joinings Fake, Srirangapuram Sarpanch Srisailam, Rangineni Srinivas Rao, Lingala Mandal Congress, Kotta Nageswara Rao, Congress Party Strong Telangana, BRS Fake Propaganda, TPCC Vice President Dr Chikkudu Vamsi Krishna, Achampet MLA, Rangineni Srinivas Rao, Srirangapuram Village News, Janardhan Reddy BRS, Makam Tirupataiah, Congress vs BRS Telangana, Lingala Sarpanch Srisailam, Pujari Ishwaramma, Youth Congress Chencheti Shiva, Nagarkurnool District Politics, Congress Press Meet, Telangana Political News, Congress Workers Support, Opposition Propaganda Exposed
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com