నీట్ లీకేజీ, రాహుల్ అరెస్ట్‌కు నిరసన; లింగాలలో మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మల దహనం

23, Jul 2026 Lingal 176 Views
Lingala Congress Protests NEET Paper Leak & Rahul Gandhi Arrest

యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి: లింగాలలో కాంగ్రెస్ నిరసన

లింగాల: నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ లింగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన హోరెత్తించాయి. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు నాయకులు రంగినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పట్టణ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. దేశానికి వెన్నుముక లాంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత తమ న్యాయమైన హక్కుల కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే మోదీ ప్రభుత్వం వారిపై పోలీసులతో అమానుషంగా లాఠీఛార్జ్ చేయించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్న తమ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం అహంకారపూరిత చర్య అని, దీనిని అచ్చంపేట నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

గతంలో UPA కాంగ్రెస్ హయాంలో ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పడి లక్షలాది ఉద్యోగాలు వచ్చాయని, నాటి పారదర్శక వ్యవస్థ నేడు మోదీ పాలనలో వ్యాపారంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు అచ్చంపేట గడ్డ నుంచి ఢిల్లీ వరకు తమ నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Lingala, Lingala News, Achampet, Achampet News, Congress Nirasana, Congress Protest, NEET Paper Leak, NEET Scam, NEET Leak Protest, Rahul Gandhi Arrest, Rahul Gandhi, Narendra Modi, Modi Government, Amit Shah, Dharmendra Pradhan, Chikkudu Vamsi Krishna, Vamsi Krishna, Rangineni Srinivasa Rao, Poojari Eswaramma Buddayya, Lingala Congress, Nagar Kurnool, Telangana Congress, Vidyarthula Hakkulu, Nirudyoga Yuvatha, Delhi Protest, BJP Government, Telangana Politics
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com