"10 ఏళ్లు గుర్తుకురాని లింగాల నేడు ఎందుకు?" - మాజీ మంత్రులను ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు

08, Sep 2025 Achampet 176 Views

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని మా లింగాల మండలం ఈరోజు గుర్తుకొచ్చిందా?..

లింగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి నిన్న జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో నాయకులు మాట్లాడిన మాటలను ఖండిస్తూ #రంగినేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది..

మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకమై మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడగొట్టి ప్రజల రాజ్యాన్ని తెచ్చుకుంటే, మీరు దీనిని చూసి ఓర్వలేక కనుమరుగైపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను మాట తప్పకుండా అమలు చేస్తున్న విధివిధానాలను చూసి బిఆర్ఎస్, బిజెపి నాయకులు ఓర్వలేక పోతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను నెరవేర్చింది, మాట తప్పకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం..

• మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

• 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా..

• గృహలక్ష్మి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్..

• 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్..

• రైతులకు రెండు లక్షల రుణమాఫీ..

• ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం..

• నూతన రేషన్ కార్డ్ అమలు.

• రేషన్ షాపులో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందుతున్న సన్న బియ్యం..

అమలు అయిన హామీలను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లారా గుర్తుపెట్టుకోండి,గుర్తు తెచ్చుకోండి గడిచిపోయిన పది సంవత్సరాల పాలనలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న దాపాలే లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్న సందర్భాన్ని చూసి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వినియోగిస్తున్న మహిళలను అగౌరపరిచిన..అయ్య మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలను విమర్శించే నైతికహక్కు నీకులేదు.బేషరతుగా క్షమాపణలు చెప్పు.లేదంటే తగిన గుణపాఠం తప్పదు..

పది సంవత్సరాలు అధికారంలో ఉండి అచ్చంపేట నియోజకవర్గానికి ఇచ్చిన హామీలలో ఎలాంటి అభివృద్ధి చేయలేక ప్రజలందరూ ఏకమై చిత్తశుద్ధితో ఉనికి కాపాడి శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిపాజిట్ గల్లంతు చేసి భారీ మెజార్టీతో #ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గారిని గెలిపించిన సందర్భాన్ని చూసి,సొంత ఉనికిని కాపాడుకోవడం కోసం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి బిజెపిలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిన వైఖరిని చూసి..

అచ్చంపేట నియోజకవర్గంలో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పేరు చెప్పి మండలాలలో అడుగుపెడుతున్నారా..

అయ్యా మర్రి తుర్రి నేనిక్కడ నిలబడే వ్యక్తిని కాదు అంటున్నావ్ అలాంటప్పుడు లింగాల మండల ప్రజలు నీకెందుకు గుర్తుకొచ్చారు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ప్రజలు ఈరోజు నీకు ఎందుకు గుర్తుకొచ్చారు..

హో...రాష్ట్రంలో నియోజకవర్గంలో జరిగే చీలికలను చూసి కార్యకర్తలను కాపాడుకోవడం కోసం చేస్తున్న నటన.

గడిచిపోయిన పది సంవత్సరాల పాలనలో ఏనాడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ గార్లకు గుర్తుకు రాని మా లింగాల మండలం ఈరోజు గుర్తుకొచ్చిందంటే టిఆర్ఎస్ కార్యకర్తను గొర్రెల్లాగా కాపాడుకోవడం కోసమే కదా మీ తపన..

యూరియా గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులకు ఒకటే చెబుతున్నాం..

యూరియా సరఫరా అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది,ఎ రోజైనా బిఆర్ఎస్ పార్టీ వాళ్లు బిజెపిని ప్రశ్నించడం జరిగిందా,లేదు దీనిబట్టి టిఆర్ఎస్,బిజెపి ఫెవికిక్ బంధం అని మనమందరం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎ గ్రామానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కనబడుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్ గత పది సంవత్సరాల పాలనలో మీరు ఇచ్చిన హామీలే మీకు గుర్తుకు లేవు మీ పాలనకు విసుగు చెంది ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంటూ మాట్లాడడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న..

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు గారు,మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెంచేటి శివ, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాయవరం గ్రామం మాజీ సర్పంచ్ మల్లయ్య, అంబటిపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్ జనార్ధన్,జ్ఞానేశ్వర్ రెడ్డి, సరాం రాజు, వెంకట్ రామ్ ,కావేటి తరుణ్, రాజేష్, సాయి,బీసీ సంఘం నాయకులు కురువ శ్రీశైలం, కావేటి వెంకటయ్య, వెంకట్ నాయక్, గుద్దేటి బాలరాజు,నాగయ్య స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

TAGS: Lingala Congress Press Meet, Srinivas Goud, Marri Janardhan Reddy, Rangineni Srinivas Rao, Achampet Politics, Congress Guarantees, Free Bus Travel, BRS BJP Alliance, Telangana Politics, Lingala Congress leaders, Rangineni Srinivas Rao, Lingala Mandal politics, former ministers remarks, Congress response Lingala, political statement Telangana, Achampet constituency news, Congress fulfilled promises, Telangana political news, Lingala Mandal development, local politics Telangana, Nagarkurnool district news, Congress leaders criticism, Telangana party politics, Achampet Congress updates

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com