సింగారంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ | వృథాగా తాగునీరు | Achampet News

30, May 2026 Achampet 176 Views
Mission Bhagiratha water leakage in Singaram village.

సింగారంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. వృథాగా తాగునీరు, కలుషితమయ్యే ప్రమాదం!

అచ్చంపేట రూరల్: అచ్చంపేట మండలంలోని సింగారం గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో తాగునీరు భారీగా వృథా అవుతోంది. సింగారం ఊర చెరువు సమీపంలో, ఉప్పునుంతల మండలం పెనిమెళ్ళ గ్రామానికి వెళ్లే దారిలో ఈ లీకేజీ ఏర్పడింది.

వాటర్ గ్రిడ్ పైపు నుండి నీరు లీక్ అవుతుండటంతో, ఆ నీరంతా చెరువు సమీపంలోని గుంతల్లో చేరుతోంది. దీనివల్ల నీరు కలుషితం కావడమే కాకుండా, ముందరి గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీరు కూడా అపరిశుభ్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు వృథాగా పోతున్నా అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి, పైపులైన్ కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

TAGS: Mission Bhagiratha Leak, Singaram Village, Achampet Rural News, Achampet Mandal, Nagarkurnool News, Drinking Water Leakage, Water Pipeline Leak, Singaram Cheruvu, Uppunuthala Mandal, Penimella Village Road, Telangana Water Supply, Mission Bhagiratha Telangana, Water Wastage News, Drinking Water Pollution, Achampet Latest News

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com