అచ్చంపేటలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం - ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రకటన

06, Dec 2025 Achampet 176 Views
అంబేద్కర్ సేవలు విశ్వ మానవాళికి మార్గదర్శకం: అచ్చంపేటలో ఘనంగా 69వ వర్ధంతి వేడుకలు

 

అచ్చంపేట పట్టణం:

భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వ పోరాట యోధుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి వేడుకలు శనివారం అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘం, అచ్చంపేట డివిజన్ అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

భారతదేశానికి దిశా, నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ సేవలు విశ్వ మానవాళికి మార్గదర్శకమని ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కొనియాడారు.

సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర అపూర్వమని అన్నారు. ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలని, అంబేద్కర్ చూపిన మార్గం మనల్ని చైతన్యవంతమైన సమాజం వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఒక ముఖ్య ప్రకటన చేశారు. విద్యార్థుల అభ్యాసానికి మరింత తోడ్పాటు అందించేందుకు అచ్చంపేట పట్టణంలో త్వరలోనే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కేంద్రంలో పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఉమామహేశ్వర చైర్మన్ బీరం మాధవరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు బీసమిళ్ళ ఆనంద్, మీసాల ప్రభాకర్, కొంకి విజయ్ కుమార్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

TAGS: Ambedkar Knowledge Center Achampet, MLA Chikkudu Vamsi Krishna News, Mahaparinirvan Diwas 2025, Achampet News Today, Pathukula Srisailam, Education in Achampet, Ambedkar Mahaparinirvan Diwas Achampet, Dr BR Ambedkar 69th death anniversary, Achampet Ambedkar Youth Association, Dr Chikkudu Vamsi Krishna tribute, Ambedkar Knowledge Center Achampet, Ambedkar Vignana Kendram announcement, Telangana Ambedkar memorial events, Achampet MLA news, student competitive exam study center Achampet, Ambedkar Vardhanti Achampet, MLA Vamshikrishna, Ambedkar Vidya Kendra, 69th Death Anniversary, Social Justice, Ambedkar Yuvajana Sangam.

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com