సివికే ఆల్ స్టార్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

11, Mar 2026 Achampet 176 Views
MLA Dr. Chikkudu Vamsi Krishna and Municipal Chairman Garlapati Srinivasulu presenting the winner's trophy at CVK Cricket Tournament

ఘనంగా ముగిసిన సివికే ఆల్ స్టార్ ప్రీమియర్ లీగ్.. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట (మార్చి 11, 2026): అచ్చంపేట పట్టణంలోని రాజీవ్ - ఎన్టీఆర్ స్టేడియంలో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగిన "సివికే ఆల్ స్టార్ ప్రీమియర్ లీగ్" క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు అచ్చంపేట శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం వల్ల యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన మెరుగుపడుతాయని అన్నారు. నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ విజేతలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, సీనియర్ నాయకులు కట్ట అనంతరెడ్డి, మల్లికార్జున్, రాజగోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Dr Chikkudu Vamsi Krishna, Achampet MLA Vamsi Krishna, CVK All Star Premier League Achampet, Rajiv NTR Stadium Achampet cricket tournament, Achampet cricket league finale, sports event Achampet Telangana, youth sports encouragement Vamsi Krishna, Achampet sports news, Nagarkurnool district cricket tournament, Achampet Municipal Chairman Garlapati Srinivasulu, Block Congress President Gopal Reddy, Telangana local sports events
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com