ఉప్పునుంతలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Nov 2025 Uppununthala 176 Views
ఉప్పునుంతలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...

రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలి: MLA చిక్కుడు వంశీకృష్ణ - కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని రైతులకు సూచన..

ఉప్పునుంతల: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఉప్పునుంతల వారి సారథ్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అచ్చంపేట శాసనసభ సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ప్రారంభించారు.

మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి MLA వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అంతటి రజిత మల్లేష్ తో కలిసి ఆయన ఈ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించిన ఈ కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కటా అనంతరెడ్డి, నరసింహారెడ్డి, ప్రతాపరెడ్డి, లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్, కృష్ణ నాయక్, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Achampet MLA Dr. Chikkudu Vamsikrishna inaugurated the Paddy Procurement Center in Uppununtala. He advised farmers to sell their paddy at government centers to secure the Minimum Support Price, MLA Dr Vamsi Krishna, Uppununthala Paddy Procurement, Achampet MLA News, PACS Uppununthala, Paddy MSP Telangana, Agriculture news Nagarkurnool, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna, Uppununthala Paddy Procurement Center, Telangana paddy procurement, MSP for farmers, PACS procurement center, Civil Supplies Department Telangana, paddy procurement Uppununthala, farmer welfare schemes Telangana, direct sale to government, eliminate middlemen, Telangana agriculture news, Nagarkurnool district farmers, paddy MSP Telangana, procurement centers inauguration

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com