నాగర్‌కర్నూల్: 63వ హోంగార్డు రైసింగ్ డే – సంక్షేమం, సేవలకు ఏఎస్పీ ప్రశంస

06, Dec 2025 Achampet 176 Views
హోంగార్డు సేవలు ప్రశంసనీయం: ప్రతి హోంగార్డుకు డ్యూటీ, 38 లక్షల ఇన్సూరెన్స్ అందజేత - నాగర్‌కర్నూల్‌లో ఘనంగా 63వ రైసింగ్ డే...

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి:

భారతదేశంలో 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ వేడుకలకు అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పనితీరు జిల్లా స్థాయిలో అత్యంత ప్రశంసనీయం అని కొనియాడారు. 63వ రైసింగ్ డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు.

హోంగార్డు బలగం - డ్యూటీ పంపిణీ: జిల్లాలో ప్రస్తుతం 160 మంది పురుషులు, 15 మంది మహిళలు కలిపి మొత్తం 175 మంది హోంగార్డులు సేవలు అందిస్తున్నారు. అదనంగా 14 మంది OD (Outsourced Duty) HGs తో కలిపి మొత్తం బలగం 189గా ఉంది. జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న ప్రత్యేక ప్రణాళికల ద్వారా waiting HGs (విధుల్లో లేని) ఎవరూ లేకుండా, ప్రతి హోంగార్డుకు GD (General Duty) & OD విధుల్లో అవకాశం కల్పించడం అభినందనీయం.

సంక్షేమ కార్యక్రమాలు - ఆర్థిక సహాయం: హోంగార్డుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు:

ఇన్సూరెన్స్ సహాయం: జిల్లాలో ఇప్పటి వరకు 12 మంది హోంగార్డులు మృతిచెందగా, వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ పరిహారం అందించడం జరిగింది. ఇందులో భాగంగా HG-883 పర్వతస్వామి కుటుంబానికి ₹38 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేశారు. అలాగే, HG-808 బాలస్వామికి ₹5 లక్షల రాగ్నల్ కంపెనీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విజయవంతమైంది. HG-940 వెంకటస్వామికి సంబంధించిన కేసు ప్రాసెస్‌లో ఉంది.

ఎక్స్‌గ్రేషియా: 2-1-2025 తర్వాత మరణించిన హోంగార్డులకు ప్రభుత్వం తరఫున ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. HG-755 దశరథం కుటుంబానికి సంబంధించిన మొత్తం అమౌంట్ మంజూరు అయినట్టు తెలిపారు.

కారుణ్య నియామకాలు: హైదరాబాద్ RM ఆదేశాల మేరకు జిల్లాలో కారుణ్య నియామకాల వివరాల సేకరణ జరుగుతోంది.

కెరీర్ పురోగతి, ఆరోగ్య భద్రత: జిల్లాలో హోంగార్డుల కెరీర్ పురోగతిలో భాగంగా 15 మంది హోంగార్డులు మరియు అదనంగా 4 మంది OD HGలు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు.

అదనంగా, అదనపు DGP స్వాతి లక్ర మేడం గారు ఇతర రాష్ట్రాలకు వెళ్లే హోంగార్డులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు అందజేశారు. ప్రతి హోంగార్డు ఆరోగ్య భద్రత కోసం ఆక్సిస్ బ్యాంక్ తో కలిసి ₹32 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ పై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

భత్యాలు, కిట్ పంపిణీ: ప్రతి హోంగార్డుకు యూనిఫామ్ అలౌన్స్ మంజూరు చేయడంతో పాటు, వారికి అవసరమైన Kit Articles & Wool Jersey లను కూడా పంపిణీ చేశారు.

ఈ వేడుకలో నాగర్ కర్నూల్ DSP శ్రీనివాసులు, CI అశోక్ రెడ్డి, RIలు జగన్, రాఘవరావు, SI గోవర్ధన్, RSIలు గౌస్ పాషా, ప్రశాంత్, కళ్యాణ్, శివాజీ సహా పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు.

TAGS: Home Guard Rising Day Nagarkurnool, Home Guard Welfare, ASP Venkateshwarlu, Home Guard Insurance, Ex-Gratia, Compassionate Appointments, Home Guard Services, Nagarkurnool Home Guards Day, Home Guard Raising Day Celebrations, ASP Venkateshwarlu, SP Sangram Singh Patil, Home Guard Welfare Telangana, Nagarkurnool News, Nagarkurnool Home Guards Raising Day, 63rd Home Guards Raising Day Telangana, District Police Parade Ground Nagarkurnool, Additional SP Venkateshwarlu speech, SP Sangram Singh Patil instructions, Home Guards role in law and order, Nagarkurnool district police news, Telangana Home Guards strength, Home Guards ceremonial salute

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com