నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 2026 Achampet 176 Views
Arya Vysya Mahasabha Convener Machipeddi Shivakumar addressing the press conference in Kalwakurthi

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్ స్పష్టం

కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ మూడు నెలల క్రితమే రద్దయిందని, ప్రస్తుతం జిల్లాకు ఎలాంటి అధికారిక కమిటీ లేదని నాగర్‌కర్నూల్ జిల్లా మహాసభ కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కమిటీ రద్దయి మూడు నెలలైంది

మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు తానూ జిల్లా కన్వీనర్‌గా నియమితుడైనప్పుడే పాత జిల్లా కమిటీ రద్దయిందని శివకుమార్ గుర్తుచేశారు. ఆ సమయం నుంచే పాత కమిటీ రద్దయిన విషయాన్ని సభ్యులంతా గమనించాలని కోరారు.

హోదాల ప్రచారం సరికాదు

కమిటీ ఇప్పటికే రద్దయినప్పటికీ, కొందరు వ్యక్తులు తామే అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా చెలామణి అవుతూ ప్రచారం చేసుకుంటున్నారని, ఇది ఎంతమాత్రం సబబు కాదని శివకుమార్ హితవు పలికారు. ఇకముందు ఎవరూ తమను తాము జిల్లా బాధ్యతులుగా ప్రకటించుకోవద్దని హెచ్చరించారు.

త్వరలోనే నూతన జిల్లా ఎన్నికలు

రాష్ట్ర కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే పారదర్శకంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు హకీం రాజేష్, రాష్ట్ర కార్యదర్శి బలుస శ్రీరాములు, మహాసభ బిల్డింగ్ కమిటీ చైర్మన్ చంద్రకుమార్, పొలిటికల్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ కొండూరి గోవర్ధన్, మాజీ అదనపు కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, వైశ్య సంఘం నాయకులు సురేష్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Kalwakurthy, Kalwakurthy News, Nagar Kurnool, Nagarkurnool News, Arya Vysya Mahasabha, Arya Vysya Sangham, Arya Vysya Committee, Nagar Kurnool Arya Vysya, Machipeddi Shivakumar, Shivakumar Convener, Amaravadi Lakshminarayana, District Committee, Committee Cancelled, New Committee Elections, Arya Vysya Elections, Vysya Community, Telangana Arya Vysya, Press Meet Kalwakurthy, Telangana Community News, Telangana News
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com