తెలంగాణలో పంట బీమా అమలు చేయాలి; జేసీ అరుణ రెడ్డికి బీజేపీ వినతి

20, Jul 2026 Achampet 176 Views
BJP Nagarkurnool leaders submitting PMFBY memorandum to Joint Collector Aruna Reddy

తెలంగాణలో 'ఫసల్ బీమా యోజన'ను వెంటనే అమలు చేయాలి: జాయింట్ కలెక్టర్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతి

నాగర్‌కర్నూల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)' పంట బీమా పథకాన్ని తెలంగాణలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ రెడ్డి కి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకం విజయవంతంగా అమలవుతూ రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోందని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం సరైన వర్షాలు లేక కరువు ముంచుకొస్తున్న తరుణంలో, అకాల వర్షాలు, తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఆదాయ భద్రత కోసం పంట బీమా అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రధాన డిమాండ్లు:

  • తెలంగాణ రాష్ట్రంలో 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి.

  • ఖరీఫ్ మరియు రబీ రెండు పంటలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలి.

  • కౌలు రైతులకు సైతం ఈ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

  • మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి.

  • ఏ ఒక్క అర్హత గల రైతు కూడా నష్టపోకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలి.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవీందర్ చౌహన్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, బీజేపీ నాయకులు కృష్ణ, రాజేశ్వర్ రెడ్డి, మహేష్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Nagarkurnool News, PM Fasal Bima Yojana Telangana, Pradhan Mantri Fasal Bima Yojana, BJP Kisan Morcha, Crop Insurance Telangana, Farmer Welfare Telangana, Nagarkurnool Farmers, Aruna Reddy Joint Collector, Kharif Crop Insurance, Rabi Crop Insurance, Tenant Farmers Insurance, Telangana Agriculture News, BJP Nagarkurnool, Farmer Crop Loss, Telangana News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com