నాగర్ కర్నూల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష వైఖరికి నిరసనగా మరియు ఓటర్ల జాబితా ప్రత్యేక స్వల్పకాలిక సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల వ్యవస్థను, ఓటర్ల జాబితా ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు (MP), శాసనసభ్యులు (MLA), శాసనమండలి సభ్యులు (MLC), వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మరియు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అందరూ హాజరై సంఘీభావం తెలియజేయాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకఅచ్చంపేట శాసనసభ్యులు మరియు నాగర్‌కర్నూల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు డా. చిక్కుడు వంశీకృష్ణ గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమ సమాచారం:
సందర్భం: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా, మరియు SIR లో జరిగిన అక్రమాలకు నిరసనగా.
తేదీ: 28వ తేదీ
సమయం: ఉదయం 10:30 గంటలకు
వేదిక: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన:
జిల్లా మంత్రులు
పార్లమెంట్ సభ్యులు (MP)
శాసనసభ్యులు (MLA) & ఎమ్మెల్సీలు (MLC)
వివిధ విభాగాల చైర్మన్లు
DCC కార్యవర్గ సభ్యులు
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, సంఘీభావం తెలిపి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com