భారత జనగణన బీసీలకు శాపంగా మారింది: బి సి ఎఫ్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ నరేష్ యాదవ్

27, Apr 2026 Achampet 176 Views
BCF State Secretary Dr. Naramoni Naresh Yadav demanding Caste Census for BCs.

జనగణనలో బీసీలకు ‘కాలం’ ఏది? కుల గణన చేయకపోవడం బీసీలకు శాపం: డాక్టర్ నారమోని నరేష్ యాదవ్

అచ్చంపేట/హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియలో బీసీలకు ప్రత్యేక కాలం (Column) కేటాయించకపోవడం పట్ల బీసీఎఫ్ (BCF) స్టేట్ సెక్రటరీ, యాదవ జేఏసీ రాష్ట్ర యువ అధ్యక్షులు డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ జనగణన బీసీల పాలిట శాపంగా మారిందని ఆయన విమర్శించారు.

ఎన్నికల స్టంట్‌గా బీసీల అంశం: ఎస్సీ, ఎస్టీలకు జనగణనలో ప్రత్యేక కాలం ఇచ్చిన ప్రభుత్వం, బీసీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే బీసీల జపం చేసే పార్టీలు, కుల గణన విషయంలో వెనకడుగు వేయడం వారి కపట ప్రేమకు నిదర్శనమన్నారు. "62 శాతం ఉన్న బీసీలు తమ హక్కుల కోసం ధర్నాలు, ఆకలి చావులకు గురవుతుంటే, కేవలం 4 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు కల్పించడం ఏ రకమైన న్యాయం?" అని ఆయన నిలదీశారు.

గొర్రెలు, బర్రెలతోనే సరిపెడతారా?: బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని, ఇంకా ఎంతకాలం గొర్రెలు, బర్రెలు, చేపలు, కుట్టు మిషన్లతో బీసీల గొంతు నొక్కుతారని నరేష్ యాదవ్ మండిపడ్డారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దమాషా ప్రకారం బీసీలకు సమచిత స్థానం దక్కాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి, జనగణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కోరారు. బీసీ ప్రజలారా మేల్కొనండి.. ప్రశ్నించే గొంతుకలకు తోడవ్వండి.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయండి అంటూ ఆయన పిలుపునిచ్చారు.

TAGS: Achampet BC caste census issue, Naramoni Naresh Yadav comments, Telangana BC census demand, Nagarkurnool district news today, Achampet latest news, BCF leaders Telangana news, caste census India debate, Telangana political news updates, BC reservation issue news, Hyderabad BC leaders protest, Achampet constituency news, Nagarkurnool breaking news, Telangana social justice news, BC rights movement Telangana, census 2027 caste column issue, Telangana latest news updates, Achampet public issues news, BC population representation news, India caste census demand, Telangana politics today
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com