సాయినగర్‌లో ₹76,000లకు గణేష్ లడ్డూ దక్కించుకున్న మంత్రాల లాలూ యాదవ్ | అచ్చంపేట

19, Sep 2026 Achampet 176 Views
Mantrala Lalu Yadav receiving the auctioned Ganesh Laddu at Sai Nagar Achampet

అచ్చంపేట సాయినగర్‌లో ఘనంగా వినాయక లడ్డూ వేలం పాట: ₹76,000లకు దక్కించుకున్న మంత్రాల లాలూ యాదవ్

అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో యాదవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నిత్య పూజలు, ప్రసాద నివేదనలు మరియు నిత్యా అన్నదాన కార్యక్రమాలతో సాయినగర్ ప్రాంగణం భక్తిపారవశ్యంతో విలసిల్లింది.

ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి లడ్డూ వేలం పాట భక్తుల ఉత్సాహం నడుమ అత్యంత పోటీగా సాగింది. వేలం పాటలో మంత్రాల లాలూ యాదవ్ మొదటి లడ్డూను ₹76,000 రూపాయలకు దక్కించుకున్నారు. అలాగే రెండవ లడ్డూను కొమ్ము వెంకటయ్య ₹10,000 రూపాయలకు సాధించగా, హుండీని మంత్రాల మల్లయ్య ₹3,000 రూపాయలకు దక్కించుకున్నారు.

గత ఐదు రోజులుగా భక్తులు స్వామివారికి కుడుములు, శనగలు, పలు రకాల ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో చిన్నలు, పెద్దలు కలిసి గణేష్ మండపం ముందు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

Tags: Sai Nagar Ganesh Laddu, Achampet Ganesh Laddu Auction, Mantrala Lalu Yadav, Achampet news, Yadav Utsav Committee Achampet, Ganesh Visarjan Achampet
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com