అచ్చంపేట: అచ్చంపేట మున్సిపల్ పరిధిలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి, మున్సిపాలిటీ అనుమతి లేకుండా చెట్టును నరికిన ఒక దుకాణ యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు.
మున్సిపల్ అధికారుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఒక దుకాణ సముదాయం ముందు ఉన్న పచ్చని చెట్టును, ముందస్తు అనుమతులు ఏవీ తీసుకోకుండా యజమాని నరికివేశారు. దీనిపై సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పచ్చదనాన్ని కాపాడాలనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ సదరు షాప్ యజమానికి రూ. 2,500 జరిమానా విధిస్తూ చలానా జారీ చేశారు. పట్టణంలో ఎవరైనా అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com