టీచర్ బెత్తం - పోలీస్ లాఠీ; బాధ్యతను విస్మరిస్తే సమాజానికి కలిగే నష్టం ఏమిటి?

13, Oct 2025 Achampet 176 Views

టీచర్ బెత్తం ... పోలీస్ లాఠీ వదిలేస్తే నష్టం ఎవరికి?

సమాజంలో కొన్ని వృత్తులు కేవలం ఉద్యోగాలు కావు అవి బాధ్యతలు, విలువలు, మార్గదర్శకాలు. అందులో భవిష్యత్ తరాలకు ఆదర్శం చూపే మూడు స్థంభాలు టీచర్, పోలీస్, వైద్యుడు. వీరి చేతుల్లోనే ఒక సమాజం మారుతుంది లేదా కూలుతుంది. కానీ నేటి కాలంలో వీరి పాత్రలు మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మార్పు సహజమే, కానీ ఆ మార్పు బాధ్యతల్ని కరిగించకూడదు భవిష్యత్తుని నాశనం చేయకూడదు. కానీ ప్రస్తుతం ఇబ్బందులలోనే ఈ శాఖలు కనిపిస్తున్నాయి.

ఉపాధ్యాయుడి స్థాయి తగ్గుతుందా?

ఒకప్పుడు ఉపాధ్యాయుడు పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పేవారు . విద్యార్థి తప్పు చేస్తే దండనతో గాడిన పెట్టేవారు. ఆ దండన వెనుక కోపం కాదు ప్రేమతో కూడిన మార్పు ఉద్దేశ్యం ఉండేది. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఉపాధ్యాయుడు మందలించినా, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, బంధువులు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. తప్పును తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా తమ పిల్లలపై ఉన్న అతి ప్రేమను చూపిస్తూ వాళ్ల భవిష్యత్తును సైతం చేతులారా ఆగం చేస్తున్నారు. ఫలితం ఉపాధ్యాయుడు వారు ఎటు పోతే నాకేంటి? నా జీతం వస్తుందిగా చాలు అన్న దశకు చేరుకున్నాడు. ఇది కేవలం ఉపాధ్యాయుడి కి నష్టం కాదు భవిష్యత్‌ తరాలకు తీరని నష్టం. విద్య అంటే పుస్తకం మాత్రమే కాదు, వ్యక్తిత్వం నిర్మించడం కూడా. దానిని వదిలేస్తే సమాజం విలువలే కూలిపోతాయి.

విద్యార్థి సంఘాలు ... దిశ తప్పుతున్నాయా?

విద్యార్థి సంఘాలు ఒకప్పుడు విద్యార్థుల కష్టాలు, సమస్యలు వారి హక్కుల కోసం గొంతుకలుగా ఉండేవి. ఫీజులు, వసతులు, నియామకాలు ఇవే ప్రధాన అంశాలు. కానీ ఇప్పుడు అనేక సంఘాలు విద్యార్థి సమస్యల్ని వదిలి రాజకీయ ర్యాలీల్లో, వ్యక్తిగత సెటిల్మెంట్లలో చిక్కుకుంటున్నాయి. యువత మార్పుకి దారిదీపం అవ్వాలి కానీ కొందరు ఫోటోలకే పరిమితమయ్యే నాయకత్వం చూపిస్తున్నారు. నిజమైన నాయకుడు అంటే గొంతు ఎత్తి అరవడం కాదు, సమస్యను పరిష్కారం చూపించడం.

విద్యార్థి సంఘాలు మళ్లీ ఆ దిశగా వెళ్లాలి అవగాహన, ఆదర్శం, ఆచరణ అనే పదాలను మర్చిపోవద్దు. విద్యార్థి సంఘాలు ఎక్కడైనా ఆందోళన చేపడితే అది విద్యార్థుల సమస్యలపై మాత్రమే ఉండాలి కానీ వ్యక్తిగత అవసరాల కోసం ఉండకూడదు.

ఫ్రెండ్లీ పోలీస్ ... హద్దులు ఎక్కడ?

ఒకప్పుడు తప్పు చేసిన వానికి పోలీస్ అనగానే భయం కలిగేది. ఇప్పుడు “ఫ్రెండ్లీ పోలీస్” పేరుతో ప్రజలకు దగ్గరవ్వాలనే ఆలోచన మంచిది. కానీ “ఫ్రెండ్లీ” పేరుతో క్రమశిక్షణను వదిలేస్తే, దాని ఫలితం ప్రమాదం. పోలీసులు 24 గంటలు సమాజ భద్రత కోసం కృషి చేస్తారు. వారు లాఠీ వదిలేస్తే నష్టం ఎవరికి? నేరస్థులకు కాదు, సాధారణ ప్రజలకే. దొంగతనాలు, దాడులు, దోపిడీలు అణచివేయాలంటే పోలీసులు కఠినంగానే ఉండాలి. కానీ ఆ పరిస్థితులు కనబడడం లేదు కారణం వాళ్లకు స్వేచ్ఛాయుత వాతావరణం లేకపోవడం. తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించిన వారికి సైతం రాజకీయ నాయకులు అండగా ఉండడం. కొన్ని వ్యవస్థలంతా రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉండడంతో వాళ్ల పోస్టింగుల కోసం తప్పని తెలిసిన మాట్లాడలేని, మందలించలేని పరిస్థితికి దిగజారింది వ్యవస్థ. ఇది అదునుగా కొంతమంది పోలీసులు తమ అధికారాన్ని ప్రజా సేవకు కాకుండా వ్యక్తిగత లాభాలకు వాడుతున్నారు. కేసులను వ్యాపారంలా చూసే ధోరణి పెరుగుతోంది. ఇది సమాజ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బాధ్యతల పునర్నిర్మాణం అవసరం

టీచర్‌ బెత్తం - పోలీస్‌ లాఠీ వదిలినా, విద్యార్థి సంఘాలు దారి తప్పినా నష్టం సమాజానికి, మన భవిష్యత్తుకి అనేది గుర్తేరిగి వ్యవహరిస్తే మంచిది

TAGS: Social Analysis Telugu, Teacher vs Student issues, Friendly Policing impact, Student Unions Ethics, Social Responsibility Article, changing roles of teachers, evolving role of police, teachers and society impact, police and society, discipline vs friendliness, importance of discipline in society, building a better nation, societal development education, law enforcement and community, teachers’ societal responsibilities, police duties and social change, education and discipline, public service roles, societal impact of teachers and police, nation building through discipline

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20261 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20262 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20261 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com