ఉమామహేశ్వర క్షేత్రంలో నిత్య అన్నదానానికి భారీ విరాళం | భక్తుల ప్రశంసలు

02, Jan 2026 Achampet 176 Views

ఉమామహేశ్వర క్షేత్ర నిత్య అన్నదానానికి రూ. 25 వేల విరాళం - అభివృద్ధి పనులు, వసతులను కొనియాడిన హైదరాబాద్ భక్తులు - చైర్మన్ బీరం మాధవరెడ్డి కృషి అమోఘం

అచ్చంపేట/రంగాపురం: శ్రీశైల ఉత్తర ద్వారం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఉదారత చాటుకున్నారు. పగిడిశిల గోత్రీకులు, హైదరాబాద్ వాస్తవ్యులు అయిన శ్రీ మనోహర్, శాంతి దంపతులు వారి కుటుంబ సభ్యులు మాధుర్యతో కలిసి తమ కుటుంబ పెద్దలు దివంగత పూరి గిర్రప్ప - బాల మనమ్మల జ్ఞాపకార్థం రూ. 25,000 నగదును నిత్య అన్నదాన పథకానికి విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా వారు ఆలయంలో గణపతి పూజ, ఉమాదేవికి కుంకుమార్చన, ఉమామహేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు కల్పిస్తున్న ఉచిత దర్శనం, వసతులు, భోగ మహేశ్వరం సౌకర్యాలు మరియు పూర్తయి ప్రతిష్టకు సిద్ధంగా ఉన్న పంచలింగాల దేవస్థాన నిర్మాణాన్ని వారు కొనియాడారు. ఆలయ పరిసరాల్లో గార్డెనింగ్, శౌచాలయాలు మరియు నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు.

అనంతరం దేవస్థానం తరపున భక్తులను స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

TAGS: Umamaheshwara Swamy Temple, Rangapuram, Beeram Madhava Reddy, Annadanam Donation, Achampet News, Srisailam Northern Gateway, Umamaheshwaram Temple Annadanam donation, ₹25000 annadanam Umamaheshwara Swamy Temple, Rangapuram Umamaheshwaram Temple news, Hyderabad devotees donation Srisailam gateway, Nitya Annadanam Umamaheshwaram, Beeram Madhava Reddy Temple Chairman, Umamaheshwaram Temple development works, Achampet Rangapuram temple news, Sri Umamaheshwara Swamy Temple services, Srisailam northern gateway temple news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com