ఉప్పునుంతల ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ప్రారంభం; భవిత భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

24, Sep 2025 Uppununthala 176 Views
ఉప్పునుంతల ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ...

ఉప్పునుంతల:

ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఇందిరమ్మ రాజ్యంలో విద్య మరియు ఆరోగ్యంపై ప్రభుత్వం అధికంగా దృష్టి సారించిందని, పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్యంగా, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు రూ. 10 లక్షల ఆరోగ్య భీమా కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తు చేశారు. వీటితో పాటు బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలియజేశారు.

వాటర్ ప్లాంట్ ప్రారంభం అనంతరం, ఎమ్మెల్యే వంశీకృష్ణ మండల కేంద్రంలో భవిత భవనానికి కూడా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, మాజీ నాయకులు అరుణ నరసింహారెడ్డి, మామిళ్ళపల్లి దేవాలయ చైర్మన్ వేముల నరసింహారావు, యువజన కాంగ్రెస్ మండల ఇంచార్జి అంతటి శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మేడముని భాస్కర్, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవస్థానాల కమిటీ డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ మండల అధ్యక్షులు, ఐఎన్టీయూసీ నాయకులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు పాల్గొన్నారు.

TAGS: Uppunuthala Government Hospital Water Plant, MLA Chikkudu Vamshikrishna, Aarogyasri 10 Lakh Insurance, Bhavitha Bhavan Bhumi Puja, Revanth Reddy Schemes, Uppunuthala Health, Achampet MLA Dr Chikkudu Vamshikrishna, Uppunuthala Government Hospital, new water plant inauguration, healthcare initiatives Telangana, Congress government welfare schemes, free education Telangana, Aarogyasri scheme ₹10 lakh, Nagarkurnool district news, Achampet constituency development, public health infrastructure, water facility for poor, government hospital upgrades, Telangana healthcare news, MLA public service initiatives, social welfare programs Telangana

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com