Road Accident Near Vatawarlapally: 4 Shiva Swamis Injured on Srisailam Highway

11, Feb 2026 Amrabad 176 Views

శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. నలుగురు శివ స్వాములకు గాయాలు

అచ్చంపేట/అమ్రాబాద్: శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైల మల్లన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న శివ స్వాముల వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మరియు హైదరాబాద్‌కు చెందిన శివ స్వాములు శ్రీశైల క్షేత్రంలో ఇరుముడి సమర్పించుకుని మహేంద్ర మినీ వ్యాన్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. వటవర్లపల్లికి రెండు కిలోమీటర్ల సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న నలుగురు శివ స్వాములకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అదే సమయంలో హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్, బీట్ ఆఫీసర్ శ్రావణి, డ్రైవర్ నిరంజన్ వెంటనే స్పందించి బాధితులను కాపాడారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను తక్షణ చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Road Accident Near Vatawarlapally: Mini Van Hits Tree, Four Shiva Swamis Injured

Achampet/Amrabad: A severe road accident occurred on the Srisailam-Hyderabad Highway on Thursday after a Mahindra mini-van carrying devotees lost control and rammed into a tree.

The victims, identified as Shiva Swamis from Medchal and Hyderabad, were returning home after visiting the Srisailam temple. The accident took place about two kilometers away from Vatawarlapally. Among the four injured, one is reported to be in critical condition.

Forest Department officials patrolling the highway—Section Officer Shiva Prasad, Beat Officer Sravani, and Driver Niranjan—reached the spot immediately. They rescued the victims and coordinated with the 108 ambulance service to shift them to Achampet Government Hospital. The timely intervention of the forest officials helped in providing immediate medical attention to the injured.

TAGS: Vatawarlapally Road Accident, Srisailam Highway Accident, Shiva Swamis Injured, Achampet Government Hospital, Forest Department Rescue, Mahindra Mini Van Crash, road accident Achampet Amrabad, Vatawarlapally accident news, Srisailam Hyderabad highway accident, Mahindra mini van accident, Shiva Swamis injured road accident, pilgrims accident Telangana, forest department rescue accident, 108 ambulance service Achampet, Achampet government hospital emergency, Nagarkurnool district accident news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com