వెల్టూరు గురుకుల పాఠశాల తరలింపుపై BCF నరేష్ యాదవ్ ఆగ్రహం

15, Jun 2026 Achampet 176 Views
veltoor-jyotiba-phule-gurukul-school-shifted-to-kalwakurthy-bcf-naresh-yadav-demands

అచ్చంపేట/వెల్టూరు:

మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను వెల్టూరు నుండి కల్వకుర్తికి, తాడూరుకు సగభాగంగా తరలించడం అత్యంత ఘోరమైన పరిణామమని, ఇది సిగ్గుచేటని బిసిఎఫ్ (BCF) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. గురుకుల పాఠశాలకు స్వంత బిల్డింగ్ నిర్మాణం లేకపోవడం, అద్దె భవనాలలో కొనసాగడం వల్లే నేడు విద్యార్థులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'ప్రజాపాలన'లో విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు, క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నారని నరేష్ యాదవ్ విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గం నుండి ఇప్పటికే ఎన్నో విద్యాసంస్థలు వేరే ప్రాంతాలకు తరలిపోయినా స్థానిక నాయకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. గతంలో గురుకుల డిగ్రీ కళాశాల (ST ట్రైబల్ వెల్ఫేర్) జడ్చర్లకు, మన్ననూర్ సి.ఓ.ఈ (COE) కాలేజీని హయత్ నగర్ కు తరలించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

పక్క నియోజకవర్గంలో కోళ్ల ఫామ్ లో పాఠశాల..

"బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పెద్దపీట వేస్తామంటున్న ప్రభుత్వాలు, కనీసం పాఠశాల భవనాలు కూడా నిర్మించలేకపోతున్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లిలో బీసీ బాయ్స్ పాఠశాల ఏకంగా ఒక కోళ్ల ఫామ్ లో నడుస్తోందంటే బీసీ విద్యార్థుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు" అని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.

ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి వెల్టూరు గురుకుల బాలికల పాఠశాలకు స్థలం కేటాయించి, శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను, వసతులను అందించాలని బిసిఎఫ్ తరఫున ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com