వెల్టూర్ గ్రామంలో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలు

03, Jan 2026 Uppununthala 176 Views

వెల్టూర్ గ్రామంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు: పూలమాలలతో నివాళులు

- భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి సేవలను కొనియాడిన సర్పంచ్ చింతోజ్ వెంకటేష్ - స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడమే ఆమెకు ఇచ్చే నిజమైన గౌరవం

వెల్టూర్ (ఉప్పునుంతల): నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ చింతోజ్ వెంకటేష్ సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా విద్యావంతులు కావాలని నాటి రోజుల్లోనే పోరాడిన గొప్ప సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. ఎన్నో అవమానాలను భరిస్తూనే బాలికల కోసం బడులు కట్టించి, నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి పునాది వేశారని కొనియాడారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పరి మల్లేష్, వార్డు సభ్యులు కాశీరెడ్డి అభితేజి రెడ్డి, పార్వతమ్మ, మౌనిక, మాజీ సర్పంచ్ జంగయ్య, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

TAGS: Savitribai Phule Jayanti 2026, Veltur Sarpanch Chinthoj Venkatesh, First Female Teacher of India, Savitribai Phule 195th Birth Anniversary, Uppununthala News, Savitribai Phule Jayanti 195th, Savitribai Phule birth anniversary celebration, Veltur village news, Uppununthala Mandal events, Savitribai Phule first female teacher, women education in India, Savitribai Phule tribute Telangana, Sarpanch Chinthoj Venkatesh, social reformer Savitribai Phule, Gram Panchayat celebration news, women empowerment Telangana, Phule Jayanti celebrations
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com