లంబాడీలు 100% ఎస్టీలే: లంబాడీల జోలికొస్తే ఓటు ఆయుధంతో గుణపాఠం - బంజారా నాయకుల హెచ్చరిక

12, Sep 2025 Achampet 176 Views

లంబాడీలు 100% ఎస్టిలే... ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ద్వారా వివరిస్తున్న బంజారా /లంబాడి నాయకులు...

అసత్య ప్రచారాలతో రాష్ట్రపతి గెజిట్ ని అవమానపరుస్తూ ,రాజ్యాంగ విరుద్ధంగా ,,ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా లంబాడీలా జోలికొస్తే చూస్తూ ఊరుకోం తగిన ఇప్పటికే ఓడిపోయి ఉన్నారు రాబోయే ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా తగిన గుణపాఠం చెబుతాం... ఓటు ఆయుధంతో తడాఖా చూపిస్తాం...

ఖబర్దార్ సోయం బాబురావు మాజీ ఎంపీ, తెల్లం వెంకటరావు ఎమ్మెల్యే బంజారా లంబాడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

 

డా కొర్ర ఈశ్వర్ లాల్, మంగ్య నాయక్

రెండు రోజుల్లో అచ్చంపేట ప్రాంతంలోని బంజారా, గిరిజన, ఉద్యోగ, ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల నాయకులతో గిరిజన భవన్ లో సమావేశపరిచి కార్యచరణ ప్రకటిస్తాం

లంబాడా సంఘం నాయకులు కొర్ర ఈశ్వర్ లాల్, మంగ్యా నాయక్, లచ్చు నాయక్, భరత్, దగ్న, జేఏసీ శ్రీను, తులసిరామ్

తెల్లారితే ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని ఇలాంటి నాయకులు ఓడిపోయినప్పుడల్లా ప్రజాభిమానం తగ్గినప్పుడు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం గెలవడం కోసం గడ్డితిని ఇలాంటి నీచ రాజకీయ నాయకుల వల్ల ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చి తమ స్వలాభం కోసం కుట్రలు కుతంత్రాలతో సామరసంగా ఉన్న ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడిపే ఇలాంటి నాయకులను బహిష్కరించి మీ సచీలతను నిరూపించుకోవాలని కోరుతున్నాము..

అచ్చంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 గిరిజన తెగలను విచ్ఛిన్నం చేసే కుట్రలను చేస్తే చూస్తూ ఊరుకోమని లంబాడా సంఘం నాయకులు కొర్ర ఈశ్వర్ లాల్, మగ్య నాయక్, భరత్ లు అన్నారు.

మంగళవారం అచ్చంపేట ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ.. బంజారా లంబాడీలు ఎస్టీలు కాదని మాజీ ప్రజాప్రతినిధులు సోయం బాపూరావు తెల్లం వెంకటరావులు సుప్రీంకోర్టు ఆశ్రయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

భారత రాజ్యాంగం 1950 ప్రకారంగా, 1965 లో ఎస్సీ, ఎస్టీల జాతుల గుర్తింపు కోసం ఐదు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 1978లో లంబాడీలతో పాటు దేశంలో 207 తెగలను మరియు తెలంగాణలో యానాది మరియు ఎరుకల జాతి వారిని కూడా గిరిజనులు కలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్లేన్, ఏజెన్సీ ఏరియాలలో రెండు విభాగాలుగా ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయిస్తున్నాయని కేవలం ఏజెన్సీలో PVTG మరియు ఐటీడీఏల ద్వారా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ ఎక్కువ నిధులు అభివృద్ధి కోసం 70% ఖర్చు చేస్తే మైదాన ప్రాంత గిరిజనులలో లంబాడి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో కేవలం 30 శాతం మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

32 గిరిజన తెగల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో ఏడు మంది కోయ గోండు వర్గానికి చెందిన వారే వారిలో నుండి ఒకరు మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు. లంబాడీలకు చెందిన వారు ఐదు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇప్పటివరకు ఓ చెంచు ఓ ఎరుకల, ఓ యా నాది, ఓ తోటి మిగతా 26 గిరిజన తెగలకు తగిన విధంగా రాజకీయ ప్రాధాన్యం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. వారి రాజకీయ అవకాశాలను ఆర్థిక అవకాశాలను ఉద్యోగ అవకాశాలను గోండులు మరియు కోయలు ఎక్కువగా స్వాహా చేస్తున్నారనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.

ఓ మాజీ ఎంపీ మరియు ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఆర్టికల్ 342 గురించి వారికి తెలియకపోవడం విచారకరమన్నారు. లంబాడీలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నబి తీరును, ప్రశాంతంగా జీవిస్తున్న ట్రైబల్స్ మధ్య శాంతి భద్రతలను భంగం కలిగించే స్టేట్మెంట్లు కోర్టు కేసులు వేసి బంజారా ప్రజలను అవమాన పరుస్తున్న అసత్య ప్రచారాలను దుర్బుద్ధిని ఆరోపణలు రాష్ట్ర పోలీస్ శాఖ అధిపతి డిజిపి గారిని కలిసి క్రిమినల్ కేసు నమోదు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాము.

సుప్రీంకోర్టులో కేసు వేసిన ఈ నాయకులు తక్షణమే బహిరంగంగా లంబాడీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేం సైతం కోర్టులో కేసు వేసి వారిని కూడా కోర్టుకు లాగుతామన్నారు.

భవిష్యత్ కార్యాచరణను రెండు రోజులలో ప్రకటించి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతం చేస్తూ 32 గిరిజన తెగల ఐక్యత కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో లంబాడ నాయకులు దగ్న, లచ్చు నాయక్, భరత్, తిరుపతి శ్రీను నాయక్ ,తులసీరామ్ తదితరులు ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20261 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20262 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20261 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com