అచ్చంపేట, జూన్ 5: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో "జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం" వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ హస్తకళల డిపార్ట్మెంట్ (DCH) అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి సువర్చల ఆదేశాల మేరకు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాతృభూమి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రమాకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చెట్ల పెంపకం ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అచ్చంపేట గాయత్రీ మాత మహిళా సంఘం నాయకురాలు రాజపుత్ర భార్గవి మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
మాతృభూమి ఫౌండర్ ప్యారసాని మంజుల మాట్లాడుతూ.. పర్యావరణానికి పెనుభారంగా మారిన ప్లాస్టిక్ సంచుల స్థానంలో ప్రతి ఒక్కరూ బట్ట సంచులను మాత్రమే వాడాలని కోరారు. అలాగే ప్రతి ఇంటిలోనూ పెరటి మొక్కలను పెంచుకోవాలని సూచించారు.
"పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక్క రోజుతో ముగిసేది కాదు. ఇది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి. ముఖ్యంగా యువకులు, మహిళలు ముందుకొచ్చి పర్యావరణ పరిరక్షణను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హస్తకళల శాఖకు, సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు." — అయ్యప్ప గురుస్వామి శ్రీ మహేష్ సింగ్, యువ నాయకులు
ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చిన వారందరికీ మొక్కలను వితరణ చేయడంతో పాటు, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం బట్ట సంచులను ఉచితంగా అందజేశారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు బాబు, పూర్ణయ్య, మహిళా నాయకురాళ్ళు తోకల శ్రీదేవి, సునీత, తిరుపతమ్మ, స్వప్న, వివేకవర్ధన్, సంధ్యారాణి మరియు చిన్నారి బాలబాలికలు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com