భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి తత్వవేత్త మానవతావాది విద్య దురంధరుడు ఐక్యరాజ్యసమితి కొనియాడుతున్న ప్రపంచ నాయకులు ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు కలిగిన భారత జాతి ముద్దుబిడ్డ వేల సంవత్సరాల బానిస సంకెళ్లను తెగ నరికిన యోధులు డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ బీమా బాయ్ రాంజీ అంబేద్కర్ గారు అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అచ్చంపేట, దళిత సంఘాల తరఫున, తెలియజేయునది, మన అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో రాజకీయ పార్టీల ప్రభుత్వ ప్రవేట్ సంస్థల ఫ్లెక్సీలు , జెండాలు తోరణాలు కట్టకూడదని గతం నుండి తెలియజేయడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలు క్రితం బిజెపి వారు పార్టీ తోరణాలు కట్టినప్పుడు వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం జరిగింది సిఐ గారి దగ్గర ఇకమీదట కట్టమని చెప్పడం జరిగింది.
గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ తోరణాలు కట్టిన తొలగించడం జరిగింది, టిఆర్ఎస్ నైట్ కట్టిన తోరణాలను మీటింగ్ చెన్నారంలో జరుగుతున్నప్పుడే తొలగించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ సైతం అలాగని తొలగించాం. అచ్చంపేట నియోజకవర్గం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వల్ల 1932 కమ్యూనల్ అవార్డు ద్వారా, భారత రాజ్యాంగం 1950 26 జనవరి లో రాజ్యాంగం ఆర్టికల్ 332 SC, STషెడ్యూల్ కులాల తెగల రాష్ట్ర అసెంబ్లీలో రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టికల్ 330 షెడ్యూల్ కులాల తెగలకు లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కేటాయించారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కలిగిన రాష్ట్ర అసెంబ్లీ లోక్సభ స్థానంలో ఉన్నటువంటి రిజర్వ్డ్ అభ్యర్థులు కనీసం అంబేద్కర్ గారిని గౌరవించకపోవడం సరైన విధానం కాదు, అంబేద్కర్ గారి పైన సెప్టెంబర్ 17వ తేదీ రోజు బిజెపి తోరణాలవల్ల 1969 తొలిదశ ఉద్యమకారులు అమరులకు మలిదశ ఉద్యమకారులకు, భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం రైతాంగ పోరాటం లో పాల్గొన్న వారి గుర్తుగా జాతీయ జెండాను 🇮🇳 చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున జెండా ఆవిష్కరించలేకపోయాం జెండా పైన బిజెపి పార్టీ తోరణాలు ఉండడంవల్ల, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ లో అంబేద్కర్ గారికి దండను వేసి ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే చేసేటువంటివారు, కానీ నేడు బిజెపిలోకి వెళ్లిన తర్వాత పార్టీ కండువాతో అంబేద్కర్ గారి నిచ్చెన స్టాచు పైన ప్రసంగించడం సరైన పద్ధతి కాదు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సబ్బండ కులాల తెగలవారు భారతదేశంలోని ప్రతి పౌరుని హక్కులు కల్పించిన వారు కుల మత లింగ బేధం లేకుండా మహిళలకు సాధికారత విద్యార్థులకు మార్గనిద్దేశకులై యావత్ భారతదేశం కొనియాడుతున్నటువంటి నేత పార్టీ తరపున అంబేద్కర్ గారి విగ్రహం పై నుండి ప్రచారం చేసుకోవడం సరైనది కాదు, మొన్న పార్లమెంట్లో గౌరవనీయులైనటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఫ్యాషన్ అయిందని
పార్లమెంటు సాక్షిగా అవహేళన చేశారు, గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారిని పార్లమెంట్ ఓపెనింగ్ చేయడానికి ఆహ్వానం లేదు, సాధువులచే పార్లమెంటును ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది రామ జన్మభూమిలోని దేవాలయం లోకి మొదటి పౌరులు రాష్ట్రపతి గారికి ఆహ్వానం లేదు, భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ పార్లమెంటు పిలవక పోవడానికి కారణాలేంటి? భర్త లేనందుకా? గోల్డెన్ టెంపుల్ శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారిని రానీయకపోతే, ఇందిరా గాంధీ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయకపోతే విధవలమైనటువంటి మాకు ప్రధాని అయ్యేటువంటి అవకాశం లేదన్నారు. భారతదేశంలోని చట్టాలను ఆర్టికల్స్ దాదాపు ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు, భారతదేశంలోని మౌలిక సూత్రాలను మార్చే వీలు పార్లమెంటుకు గాని సుప్రీంకోర్టు గాని లేనందున భారతదేశమైనటువంటి ప్రజలం అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి ఉంటాం., ఈరోజు 72 దేశాల రాజ్యాంగాలను మార్చుకున్నారు, పక్క దేశాలు నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి, పార్లమెంట్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఫోటో తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం! లైబ్రరీ,!పార్లమెంట్లో ఏర్పాటు చేయాలి, బొంబాయి లోని అంబేద్కర్ గారి నివాసం రాజగృహ ప్రపంచంలోనే రెండో గ్రంథాలయం కొన్ని మత సంస్థలు? స్టే ఆర్డర్ తో సీల్ చేయించడం జరిగింది.
ఆర్ఎస్ఎస్ నాథూరం గాడ్సే స్వతంత్ర సమరయోధులు భారత జాతి కి స్వతంత్రం అందించిన మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారిని తుపాకితో కాల్చి చంపడాన్ని యావత్ ప్రపంచం వ్యతిరేకించింది, అలాంటి ఆర్ఎస్ఎస్ ను పొగడడం ఆగస్టు 15న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పొగడడం వల్ల ✊నిజమైన దేశభక్తులు స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ చంద్రశేఖర్ మరెందరో అమరులైన ప్రాణ త్యాగాలు చేసిన వారు ఎందరో ఉన్నారు, నాడు 1930 మార్చి 2 నాసిక్ దేవాలయ ప్రవేశ ఉద్యమం 15 వేల మందితో ✊500 మంది మహిళలతో కాలరాం దేవాలయం ప్రవేశ తలుపులు నెల రోజులపాటు ఉద్యమం జరిగితే బ్రిటిష్ సూపర్డెంట్ ఆ దేవాలయాల దగ్గర కాపలాగా ఉన్నారు, 1933 ఫిబ్రవరి 12 తెల్ల దొరలు తమకోసం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక క్లబ్లు కుక్కలకు భారతీయులకు ప్రవేశం లేదని బోర్డులు పెడితే భారతీయులు ఆ క్లబ్ లోకి వెళ్ళలేదు నిరాకరించినట్టు ☝️ మేము హిందూ దేవాలయాల్లోకి వెళ్లడానికి నిరాకరిస్తున్నాం మీలో పవిత్రమైన మానవత దృక్పథం నైతిక విలువలు ఉండి ఉంటే దళితుల కోసం ఆలయాలు తెరిచి విజ్ఞానవంతులని నిరూపించుకోండి జ్ఞానవంతులుగా కాక హిందువులు గానే ఉండటం మీకు ఇష్టమైతే మీ దేవాలయాల తలుపులు గట్టిగా బిగించుకోండి మీ దేవాలయాలలోకి వెళ్లాలని ఆసక్తి ఆరాటం మాకెంత మాత్రం లేదు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అన్నారు మసాలా వీరన్న మాజీ మంత్రి రాఘవేంద్ర టెంపుల్ మంత్రాలయం గుడి ని, దర్శించినందుకు గుడిని శుభ్రం చేసుకోవడం జరిగింది ఇది మన దేశ మనుధర్మ శాస్త్రానికి నిదర్శనం కాదా!!. భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం,శోభ్రాతృత్వం, భారత ప్రజలమైన మేము తమకు తాముగా భారత రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకుంటున్నాం రాసుకుంటున్నాం
తెలియజేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు, పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఫ్యాషన్ అన్నందుకు నేటికీ వెనకాలికి తీసుకోలేదు మాటను, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సుప్రీంకోర్టు తొలగించడానికి చూస్తే 2017 లో వరంగల్ మీటింగ్ కోసం, ఎస్సీ ఎస్టీలమైన అందరం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి జరిగితే 11 మంది ని కాల్చి చంపియన కేంద్ర ప్రభుత్వం! అమర్నాడే రాజ్నాథ్ సింగ్ సుప్రీంకోర్టులో క్యావైట్ వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కొనసాగించడం జరుగుతుంది 11 మంది మరణానికి కారణం ఎవరు ? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెనుకబడ్డ అగ్రవర్ణాలు ఈ విషయాలన్నీ గమనించాల్సిందిగా కోరుతూ జాతి యావత్తు మానవజాతిగా మనుషుల జాతిగా జాతీయతలో సమైక్యతగా 🇮🇳 వెలుగొందాలని దృఢమైన రాజ్యాంగం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల చేతిలో ఉండాలని,, కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని పార్లమెంటు ద్వారా చట్టం తేవాలని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎంపీలకు అదేవిధంగా,,మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని భారత రాజ్యాంగం పాఠ్యాంశంలో చేర్చాలని బోధించాలని
కోరుతున్నాం ☝️ , దయచేసి వివిధ వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఎలాంటి ఫ్లెక్సీలు తోరణాలు జెండాలు కట్టకూడదని అచ్చంపేట అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు అచ్చంపేట పాతుకుల శ్రీశైలం, ☝️ కోశాధికారి కొంకి విజయ్, ముఖ్య సలహాదారులు పిల్లి హరిచంద్ర బిసమల ఆనంద్ కాశన్న యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూతిబిసమల ఆనంద్ మండారి ప్రభాకర్ మోతే పెంటయ్య అడ్వకేట్ ప్రశాంత్, కౌన్సిలర్స్ మోయిస్ రాఘవులు కుందా మల్లికార్జున్ పాతుకుల శ్యామ్ సుందర్ మాజీ కౌన్సిలర్ హుస్సేన్ నరముల విష్ణు మండారి పర్వతాలు అంతటి రామకృష్ణ, పాతుకుల అశోక్ ఎలికంటి నిరంజన్ ప్రజా కవి గోపాల్ గద్దర్ విగ్రహ కమిటీ యాదన్న పాండు,,గంధం స్వామి,, రామస్వామి ముత్యాలు తూర్పాటి రాజారాం రాంజీ చిన్న అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com